శరత్‌కు ఫోన్ చేసిన కేసీఆర్: కలెక్టర్ భారతికి ఆదేశాలు (ఆడియో)

Published : Mar 27, 2019, 04:37 PM ISTUpdated : Mar 27, 2019, 05:30 PM IST
శరత్‌కు ఫోన్ చేసిన కేసీఆర్: కలెక్టర్ భారతికి ఆదేశాలు (ఆడియో)

సారాంశం

తమ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేయించుకొన్నారని సోషల్ మీడియాలో శరత్ అనే యువకుడు తన ఆవేదనను పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శరత్‌తో ఫోన్లో మాట్లాడారు

మంచిర్యాల: తమ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేయించుకొన్నారని సోషల్ మీడియాలో శరత్ అనే యువకుడు తన ఆవేదనను పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శరత్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ హూలికేరి భారతిని సీఎం ఆదేశించారు.

తమ కుటుంబం ఎదుర్కొంటున్న భూ సమస్యను శరత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ శరత్ పోస్టుకు రెస్పాండ్ అయ్యాడు.  మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలానికి చెందినవాడు శరత్.  

శరత్ సోషల్ మీడియాలో పోస్టుపై కేసీఆర్ ఫోన్లో ఆయనతో మాట్లాడారు. ఈ సమస్యను వీలైనంత త్వరగానే పరిష్కరిస్తామని  కేసీఆర్ హామీ ఇచ్చారు.సీఎం ఆదేశాలతో కలెక్టర్ హోలికేరి భారతి గ్రామానికి వెళ్లి శరత్‌ కుటుంబంతో మాట్లాడారు. ఆ కుటుంబం సమస్యను పరిష్కరిస్తామన్నారు.
 

                   "

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?