ప్రయాణికులకు శుభవార్త....మెట్రో, ఆర్టీసి, ఎంఎంటీఎస్, ఆటో, క్యాబ్ ప్రయాణానికి ఒకే కార్డ్

By Arun Kumar PFirst Published Mar 27, 2019, 3:59 PM IST
Highlights

రోజురోజుకు విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రయాణికుల కష్టాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసి వంటి ప్రభుత్వ సంస్థలు ఆటోలు, క్యాబ్ లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి మధ్య సమన్వయం లోపించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వాటన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి అన్ని రకాల ప్రజారవాణా సంస్థల్లో పనిచేసేలా ఓ కామన్ కామన్ మొబిలిటీ కార్డు ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  

ఈ కామన్ మొబిలిటీ కార్డు సేవలను అందించేందుకు ఏజెన్సీని ఎంపిక చేసే నిమిత్తం ఆర్ఎఫ్‌పి ( రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ) ని జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో  ప్రయాణికులకు కామన్ మొబిలిటీ కార్డు అందించే విషయంపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ... ప్రయాణికులకు అందించే కామన్ మొబిలిటీ కార్డు ద్వారా రైల్వే, మెట్రోరైల్, క్యాబ్ లు, ఆటోలు, ఆర్‌టిసి ప్రయాణికుల అవసరాలు తీరాలని అన్నారు. అలాగే ఈ కార్డు వేరే అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు, వివిధ రవాణా  మార్గాల పద్దతుల ద్వారా ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా చూడాలన్నారు. క్యూఆర్ కోడ్, స్వైపింగ్ తదితర ఓపెన్ లూపింగ్ టికెటింగ్ సిస్టమ్ ఉండాలన్నారు. 

కేంద్ర ప్రభుత్వం  సిఫారసు చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు ఎన్‌పిసిఐ ( నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) స్పెసిఫికేషన్ల పైనా చర్చించారు. ఒకే ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులు, భవిష్యత్తు టెక్నాలజీని దృష్టిలో ఉంచుకోని కార్డుని రూపొందించే బాధ్యతలు అప్పగించాలని సీఎస్ సూచించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, రోడ్డు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, మెట్రోరైల్ ఎండీ ఎన్‌విఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే సిజియం కెవి రావు, ఆర్టిసి ఈడి పురుషోత్తం నాయక్ లతో పాటు ఓలా, ఊబర్, ఆటో యూనియన్ లు, సర్వీస్ ప్రోవైడర్లు, బ్యాంక్,ఎల్&టి ప్రతినిధులు పాల్గొన్నారు.
 
click me!