కేసీఆర్ కు మరో అవకాశం ఇవ్వండి: డిప్యూటీ సీఎం కడియం

By rajesh yFirst Published Sep 2, 2018, 7:01 PM IST
Highlights

భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రగతినివేదన సభ ఓ చరిత్ర సృష్టించబోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలని రైతును రాజు చెయ్యాలన్న లక్ష్యంతో పంట రుణ మాఫీ చేశామని అలాగే 24లు ఉచిత విద్యుత్ అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.  

హైదరాబాద్ : భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రగతినివేదన సభ ఓ చరిత్ర సృష్టించబోతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలని రైతును రాజు చెయ్యాలన్న లక్ష్యంతో పంట రుణ మాఫీ చేశామని అలాగే 24లు ఉచిత విద్యుత్ అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.  

అలాగే రైతు బంధు, రైతు భీమా కార్యక్రమాల ద్వారా రైతుకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని కడియం కొనియాడారు. రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ కు అండగా ఉండాలని కోరారు. 

నాలుగు సంవత్సరాల మూడు మాసాలలో దేశానికే ఆదర్శవంతమైన అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఎన్నోఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోవడం కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమని తెలిపారు. 

తెలంగాణ ఘోష తెలిసిన వ్యక్తి కాబట్టే తెలంగాణ ప్రజలకు ఏం అవసరమో అలాంటి పథకాలను అమలు చేశారన్నారు. టీఆర్ఎస్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు అమలు చెయ్యడం ఆయనకే సాధ్యమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యడంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసిన ఘనత కేసీఆర్ కే సాధ్యమన్నారు. 

పేద విద్యార్థులకు విద్య అందించాలనే లక్ష్యంతో వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పరిచిన ఘనత కేసీఆర్ దేనన్నారు. సీఎం కేసీఆర్ చేసిన  కృషి వల్లే రాష్ట్రం అభివృద్దిలో ముందుకు దూసుకుపోతోందన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గుర్తుండిపోవాలంటే మరోసారి సీఎం కేసీఆర్ ను బలపర్చాలని కడియం శ్రీహరి ప్రజలను కోరారు. 


 

click me!