కేసీఆర్ నామినేషన్: సెంటు భూమి లేదు.. సొంత కారు లేదు కానీ.. !

By Mahesh Rajamoni  |  First Published Nov 10, 2023, 1:02 AM IST

KCR: గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో రెండు సెట్ల నామినేషన్ ను సీఎం కేసీఆర్ దాఖ‌లు చేశారు. ఆ త‌ర్వాత హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి చేరుకునీ, అక్క‌డి ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖ‌లు చేశారు.
 


KCR Nomination: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇదివ‌ర‌కు పోటీ చేసిన గ‌జ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా కేసీఆర్ ఎన్నిక‌ల బరిలోకి దిగుతున్నారు. ఈ క్ర‌మంలోనే నామినేష‌న్లు దాఖ‌లు చేసిన కేసీఆర్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త‌న‌కు ఒక్క సెంటు భూమి కూడా లేద‌నీ, కారు కూడా లేద‌ని కేసీఆర్ త‌న ఆఫిడ‌విట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన చేతిలో రూ. 2లక్షల 96వేల క్యాష్‌ మాత్రమే ఉన్నట్లు తెలిపారు.

గజ్వేల్‌లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో రెండు సెట్ల నామినేషన్ ను సీఎం కేసీఆర్ దాఖ‌లు చేశారు. ఆ త‌ర్వాత హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి చేరుకునీ, అక్క‌డి ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖ‌లు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తనకు వ్యవసాయ భూములు లేవని కేసీఆర్ పేర్కొన్నారు. తనకు కార్లు లేదా ఇతర వాహనాలు కూడా లేవని తెలిపారు. అయితే, కేసీఆర్, ఆయన సతీమణి శోభారావు తమ వార్షికాదాయం రూ.1.6 కోట్లతో మొత్తం రూ.58.7 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. 

Latest Videos

తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి, దేశంలోనే అత్యంత ధనిక పార్టీల్లో ఒకటైన బీఆర్‌ఎస్ పార్టీని నడిపిస్తున్న కేసీఆర్ తనకు భూములు, కార్లు లేవని పేర్కొనడం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, సొంతంగా కారు, బైక్ లేన‌ప్ప‌టికీ.. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ వంటి 14 వాహ‌నాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వాటి విలువ రూ.1.16 కోట్లుగా తెలిపారు. కాగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఈ సారి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు, బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సైతం పోటీ చేస్తున్నారు.

click me!