దుబ్బాక ఫలితాలపై కేసీఆర్ పోస్టుమార్టం: పార్టీ నేతలతో భేటీ

By narsimha lodeFirst Published Nov 12, 2020, 1:19 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో గురువారం నాడు సమీక్ష నిర్వహిస్తున్నారు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో గురువారం నాడు సమీక్ష నిర్వహిస్తున్నారు.మంత్రులు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ నాయకత్వం స్థానిక నాయకత్వాన్ని రిపోర్టు కోరింది. ఈ నివేదికపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.

 

జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో గురువారం నాడు సమీక్ష నిర్వహిస్తున్నారు.మంత్రులు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేయనున్నారు.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

 

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ ఈ ఎన్నికల్లో  విజయం సాధించడం టీఆర్ఎస్ ను షాక్ కు గురి చేసింది. భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ నేతలు గతంలో ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ టీఆర్ఎస్ కు సవాల్ విసిరింది.

also read:దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కి బీజేపీ షాక్, టీఆర్ఎస్ కు దెబ్బేనా?

జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవాలని కూడ బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఈ తరుణంలో పార్టీ కీలక నేతలతో కేసీఆర్ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని ఎలా కట్టడి చేయాలి.. ఇతర పార్టీలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై టీఆర్ఎస్ వ్యూహారచన చేయనుంది. 

ఈ ఏడాది డిసెంబర్  మొదటివారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీపావళి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 

వచ్చే ఏడాదిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ,ఖమ్మం, వరంగల్ తో పాటు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను కూడ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.

click me!