
కెసిఆర్ ఈ మధ్య అన్నీ సంచలన ప్రకటనలే చేస్తున్నారు. ఆ మధ్య జూన్ ఒకటో తేదీలోపు తెలంగాణా రోడ్ల మీద గుంత ఉండటానికి వీల్లేదన్నారు. జూన్ ఒకటో తేదీన తాను స్వయంగా రోడ్లన్నీ చూస్తానని, గుంత కనపడితే, అధికారులను అక్కడిక్కడే సస్పెండ్ చేస్తానని చెప్పారు. దీనికి గడువు ఒక్క రోజే ఉంది. తెలంగాణా రోడ్లు ఎలా మారతాయో, ఎంత మంది ఉద్యోగులు సస్పెండ్ అవుతారో చూడాలి.
ఈ రోజు ఆయన విద్యార్థుల, నిరుద్యోగుల చెవులకు మ్యూజిక్ లాంటి ప్రకటన చేశారు.
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో వెంటనే 20వేలకు పైగా ఖాళీలను పూరించాలని చెప్పారు. ఈ నియామకాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.
వారంలోగా నియామక ప్రక్రియ ప్రారంభించాలని హుకుం జారీ చేవారు.
బోధనేతర సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మాట్లాడుతూ వివిధ విద్యాసంస్థల్లో 20 వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
ఉద్యోగాలిలా ఉన్నాయి.
కస్తూర్భా గాంధీ పాఠాలలో 1,428 పోస్టులు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశఆలలో 377 పోస్టులు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300, ప్రభుత్వ పాఠశాలల్లో 8,792, కాలేజీలు, ప్రభుత్వ శాఖల్లో 2,437 ఉద్యోగాలు.
ఈ రోజే తెలంగాణా జెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండ్ రామ్ సిబ్బంది నియామాకాలు లేక రాష్ట్రంలో పాలన పడకేసిందని తీవ్రమయిన విమర్శచేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని అన్నారు.