నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

By narsimha lodeFirst Published Dec 17, 2018, 7:55 PM IST
Highlights

 గతానికి భిన్నంగా ఈ దఫా తన కేబినెట్ కూర్పు కోసం  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు

హైదరాబాద్: గతానికి భిన్నంగా ఈ దఫా తన కేబినెట్ కూర్పు కోసం  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు పనితీరు ఆధారంగానే  కేబినెట్ బెర్తులను ఖరారు చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరుకు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని పార్టీలో ప్రచారంలో ఉంది.

తెలంగాణ సీఎం కేసీఆర్  రెండో దఫా  అధికారంలోకి వచ్చారు. అయితే ఈ నెల 13వ, తేదీన  మధ్యాహ్నం కేసీఆర్  రాజ్‌భవన్‌లో కేసీఆర్ సీఎం ప్రమాణస్వీకారం చేశారు. తనతో పాటు మహమూద్ అలీతో ప్రమాణం చేయించారు. గతంలో కేసీఆర్ కేబినెట్ లో మహమూద్ అలీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఈ దఫా మహమూద్ అలీకి హోం మంత్రిత్వశాఖను కేటాయించారు.

అయితే తొలి విడతగా తన కేబినెట్‌లో కేసీఆర్ ఆరుగురు లేదా ఎనిమిది మందిని మంత్రులుగా తీసుకొనే  అవకాశం లేకపోలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తి స్థాయి కేబినెట్ ను విస్తరించే అవకాశం లేకపోలేదు.  అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత  కేసీఆర్  జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కేటీఆర్ కు పగ్గాలు అప్పగించే ఛాన్స్ కూడ లేకపోలేదనే ప్రచారం కూడ ఉంది. ఇందులో భాగంగానే కేటీఆర్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారనే ప్రచారం కూడ లేకపోలేదు.

అసెంబ్లీ సెషన్‌లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం  చేసిన తర్వాత తొలి విడత మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు  సమాచారం.గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలతో పాటు ఈ దఫా ఎన్నికల్లో  కూడ ఇచ్చిన హమీలను అమలు చేయాలంటే  సమర్ధవంతులైన మంత్రులు ఉండాలని  కేసీఆర్ అభిప్రాయంతో ఉన్నారు.

మంత్రివర్త విస్తరణకు కేసీఆర్ అంతగా తొందరపడడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారిలో  సుమారు  ఏడు నుండి ఎనిమిది మంది టీఆర్ఎస్ లో చేరేందుకు రాయబారాలు నడుపుతున్నారని ప్రచారం సాగింది.ఒకవేళ అదే జరిగితే టీఆర్ఎస్ లో చేరిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టే అవకాశం కూడ లేకపోలేదు.

ఇప్పటికే 88 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి  టీఆర్ఎస్ లో చేరితే వారి రాజకీయ అనుభవం ఇతరత్రా పరిస్థితులను బట్టి కేబినెట్ బెర్త్ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ నెలాఖరుకు  మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దఫా 8 మంది కంటే ఎక్కువ మందికి కేబినెట్ లో చోటు దక్కకపోవచ్చనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

మరోవైపు కేబినెట్‌లో చోటు కోసం ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే  కేసీఆర్ ఎవరిని కరుణిస్తారో చూడాలి.

click me!