షాకింగ్: ఇనుపపెట్టెలో యువకుడి అస్తిపంజరం, సంచలన విషయాలు

Published : Feb 10, 2021, 01:41 PM ISTUpdated : Feb 10, 2021, 01:42 PM IST
షాకింగ్: ఇనుపపెట్టెలో యువకుడి అస్తిపంజరం, సంచలన విషయాలు

సారాంశం

హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. గత 8 నెలలుగా మూసి ఉన్న ఓ దుకాణంలోని ఓ ఇనుప పెట్టెలో యువకుడి అస్తిపంజరం బయటపడింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లో ఉన్న దుకాణంలో యువకుడి అస్తిపంజరం బయటపడింది. మూసి ఉన్న దుకాణంలో అది వెలుగు చూసింది. దీనికి సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

షాపులోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దుకాణం ద్వారం తలుపులు పగులగొట్టి తనిఖీ చేశారు ఓ ఇనుప పెట్టెలో యువకుడి అస్తిపంజరం ఆ తనిఖీల్లో బయపడింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కార్పెంటర్ సాయిబాబా గుడి గోదాంను అద్దెకు తీసుకుని వర్క్ షాపు నిర్వహిస్తున్నాడు. 

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో కార్పెంటర్ షాపును మూసేసి స్వగ్రామం వెళ్లిపోయాడు. ఎనిమిది నెలలుగా అది మూసే ఉంది. కార్పెంటర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం