రేపే జగన్, కేసీఆర్‌ల భేటీ: ఎజెండా ఇదే

By narsimha lodeFirst Published Sep 22, 2019, 5:30 PM IST
Highlights

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను చర్చించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు మరోసారి బేటీ కానున్నారు. 

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంల సమావేశం సోమవారం నాడు హైద్రాబాద్‌లో జరగనుంది. ప్రగతి భవన్‌లో సోమవారం నాడు సాయంత్రం వీరిద్దరూ సమావేశం కానున్నారు.

 రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలపై  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా గోదావరి నది జలాలను  కృష్ణా ఆయకట్టుకు మళ్లించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.

ఇదే విషయమై ఇప్పటికే మూడు దఫాలు రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. వాస్తవానికి ఎల్లుండి రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించాలని భావించారు.కానీ,  ఈ సమావేశాన్ని ఒక్క రోజు ముందుకు జరిపారు. దీంతో సోమవారం నాడు సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై  చర్చించనున్నారు.  రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు.నది జలాలను సద్వినియోగం చేసుకొనే విషయమై సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

24న జగన్, కేసీఆర్‌ల భేటీ: కీలక అంశాలపై చర్చ

click me!