కొప్పుల మహేశ్వర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

Siva Kodati |  
Published : Sep 22, 2019, 05:17 PM IST
కొప్పుల మహేశ్వర్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

సారాంశం

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిగి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ నేతలతో ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆసుపత్రికి వచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిగి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

ఆదివారం మధ్యాహ్నం పార్టీ నేతలతో ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆసుపత్రికి వచ్చిన కేటీఆర్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంటే మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు.

శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తున్న మహేశ్వర్ రెడ్డి కారు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యేను హైదారాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా