నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీ ఫామ్ అందించిన కేసీఆర్

Published : Feb 17, 2021, 04:45 PM ISTUpdated : Feb 17, 2021, 04:50 PM IST
నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీ ఫామ్ అందించిన కేసీఆర్

సారాంశం

నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా  పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బుధవారం నాడు బీ ఫామ్ అందించారు.

హైదరాబాద్: నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా  పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బుధవారం నాడు బీ ఫామ్ అందించారు.రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ  ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం నాడు ఎన్నికల సంఘం విడుదల చేసింది.

నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ  స్థానానికి  పల్లా రాజేశ్వర్ రెడ్డిని  టీఆర్ఎస్ మరోసారి బరిలోకి దింపింది. గతంలో ఇదే స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇదే స్థానం నుండి పోటీ చేస్తున్నారు.

ఈ స్థానం నుండి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి భీ ఫామ్ అందించారు.

హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి  పోటీ చేసే అభ్యర్ధిని టీఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానం నుండి టీఆర్ఎస్ ఎవరినైనా బరిలోకి దింపుతోందా.. లేదా పోటీలో ఉన్న అభ్యర్ధులకు మద్దతును ఇస్తోందా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!