కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై కేసీఆర్ అసంతృప్తి

By narsimha lodeFirst Published Jan 1, 2019, 2:45 PM IST
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంపై  తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలని  కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
 


భూపాలపల్లి:కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంపై  తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలని  కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు  మేడిగడ్డ వద్ద  రిజర్వాయర్ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణరెడ్డి  స్థానిక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని  కాంగ్రెస్ ఎమ్మెల్యలు వినతి పత్రం సమర్పించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రాజెక్టు పురోగతిని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. అధికారులతో  కేసీఆర్ చర్చించారు. పనులు  జరుగుతున్న తీరుతెన్నులను కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు.

పనుల్లో వేగాన్ని  మరింత పెంచాలని  కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ రాత్రికి కేసీఆర్ కరీంనగర్ లోనే బస చేయనున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ప్రాజెక్టులను పరిశీలించి సీఎం కేసీఆర్ కు నివేదికను సీఎంకు  సమర్పించారు.

రేపు ఉదయం కాళేశ్వరం నుండి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు నీరందించే ప్రాంతాలను కేసీఆర్  పరిశీలించనున్నారు. ఈ నెల 3వ తేదీ  లేదా నాలుగో తేదీన కేసీఆర్ ప్రాజెక్టు పురోగతిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

click me!