లేడీ టెక్కీని పెళ్లి చేసుకుని అతను ఏం చేశాడంటే...

By pratap reddyFirst Published Jan 1, 2019, 11:05 AM IST
Highlights

నిందితుడు అఖిలేష్ గుర్జార్ భోపాల్ కు చెందినవాడు. భారత్ మోట్రిమోనీ ద్వారా తనను పరిచయం చేసుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ నని చెప్పి నమ్మించాడు. 

హైదరాబాద్: ఓ వ్యాపారవేత్త మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరును పెళ్లి చేసుకున్నాడు. 36 ఏళ్ల ఆ వ్యాపారవేత్త మోసం చేసి ఆమె పేరు మీద అప్పులు తీసుకున్నాడు. ఆమె ఆభరణాలను చోరీ చేశాడు. మోసం చేసి ఆ పనిచేసిన వ్యాపారవేత్తను హైదరాబాదులోని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. 

నిందితుడు అఖిలేష్ గుర్జార్ భోపాల్ కు చెందినవాడు. భారత్ మోట్రిమోనీ ద్వారా తనను పరిచయం చేసుకున్నాడు. ఆర్మీ ఆఫీసర్ నని చెప్పి నమ్మించాడు. 

నిరుడు మేలో హైదరాబాదులోని కూకట్ పల్లి ఆర్య సమాజ్ లో ఇరువురు వివాహం చేసుకున్నారు. బీమా చేయిస్తానని చెప్పి ఆమె సంతకాలను తీసుకున్నాడు.  బజాజ్ ఫైనాన్స్ నుంచి 12 లక్షల రూపాయలు, ఇండియన్ బుల్స్ నుంచి 2 లక్షల రూపాయలు పర్సనల్ లోన్స్ తీసుకున్నాడు. 

ఆమె ఆమెక్స్ క్రెడిట్ కార్డు ద్వారా 4.91 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నాడు. ఎస్బీఐ కార్డు ద్వారా 2.71 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆమె సేవింగ్స్ ఖాతా నుంచి 5.6 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి 10 లక్షల రూపాయలు కాజేశాడు. 

దాదాపు 60 లక్షల రూపాయల విలువ చేసే ఆమె బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ వెళ్లిపోయాడు. అతనికి అప్పటికే పెళ్లయి ఏడేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. అతను దేశవ్యాప్తంగా 15 మంది అమ్మాయిలను మోసం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

click me!