రోడ్డు మీద బిడ్డకు.. తన భార్యతో పాలు ఇప్పించిన కానిస్టేబుల్

By sivanagaprasad KodatiFirst Published Jan 1, 2019, 10:18 AM IST
Highlights

ఖాకీ డ్రెస్ వేసుకున్నవాళ్లు కరకుగా ఉంటారని, వాళ్లకి ఏ మాత్రం జాలి ఉండదని చెబుతూ ఉంటారు. కానీ తాము మనుషులమేనని, తమకు కూడా మానవత్వం ఉందని నిరూపించారు, ఆకలితో గుక్కపట్టిన బిడ్డకు పాలిచ్చింది హైదరాబాద్‌లోని ఓ పోలీస్ జంట. 

ఖాకీ డ్రెస్ వేసుకున్నవాళ్లు కరకుగా ఉంటారని, వాళ్లకి ఏ మాత్రం జాలి ఉండదని చెబుతూ ఉంటారు. కానీ తాము మనుషులమేనని, తమకు కూడా మానవత్వం ఉందని నిరూపించారు, ఆకలితో గుక్కపట్టిన బిడ్డకు పాలిచ్చింది హైదరాబాద్‌లోని ఓ పోలీస్ జంట.

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌‌కు చెందిన రవీందర్ నే కానిస్టేబుల్ శనివారం రాత్రి విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ చంటిపాప పాల కోసం పెద్దగా రోదిస్తూ రోడ్డు పక్కన కనిపించింది.

తల్లి పక్కనే ఉన్నప్పటికీ ఫుల్లుగా మందుకొట్టడంతో ఆమె కిందిపడిపోయింది. ఆమెను లేపడానికి రవీందర్ ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏడ్చి ఏడ్చి బిడ్డ ప్రాణం పోయేలా ఉండటంతో వెంటనే తన భార్య గుర్తొచ్చింది.

బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సతీమణి ప్రియాంకకు ఫోన్ చేసి పరిస్ధితిని వివరించాడు.  ఫోన్‌లో బిడ్డ ఏడుపును విన్న ఆమె వెంటనే అక్కడి నుంచి క్యాబ్‌ బుక్ చేసుకుని భర్త దగ్గరికి వెళ్లింది.

పసిబిడ్డను ఓడిలోకి తీసుకుని తన పాలిచ్చింది పడుకోబెట్టింది. అనంతరం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి పాపకు చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కానిస్టేబుల్ దంపతులను తన కార్యాలయానికి పిలిపించి.. వారికి బహుమతులు అందించారు. 

 

Priyanka,constable of Hyderabad Police breastfed a 2-mnth-old baby who was found abandoned near Osmania Hospital y'day, says,"my husband who is a constable told me about the baby&I immediately decided to see her.Upon seeing her I realised she was hungry&breastfed her,felt happy." pic.twitter.com/TNE3NaQkHE

— ANI (@ANI)
click me!