జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. వైద్య కళాశాలకు భూమి పూజ..

Published : Dec 07, 2022, 02:15 PM IST
జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. వైద్య కళాశాలకు భూమి పూజ..

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాలకు చేరుకున్న కేసీఆర్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాలకు చేరుకున్న కేసీఆర్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును సీట్లో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, కౌశిక్ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

తర్వాత నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం వద్దకు చేరుకుని.. దానిని ప్రారంభిస్తారు. అక్కడే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మోతె శివారులోని నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. అయితే సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఏం మాట్లాడనున్నారు?, జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జగిత్యాల భారీ భద్రత ఏర్పాటు చేశారు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్