వికారాబాద్ పొలాల్లో వింత శకటం.. భయాందోళనలో ప్రజలు..కంగారు పడాల్సిందిలేదన్న అధికారులు.. ఇంతకీ అదేంటంటే..

By SumaBala BukkaFirst Published Dec 7, 2022, 2:06 PM IST
Highlights

వికారాబాద్ లో ఎక్కడినుంచో వచ్చి పడిన ఓ వింత వస్తువు కలకలం రేపింది. పెద్దగా, గుండ్రంగా ఉన్న దాన్ని చూడడానికి జనం ఎగబడ్డారు.

హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఓ వింత శకటం కలకలం రేపుతోంది. మొగిలిగుండ్ల ప్రాంతంలో ఈ శకటం కనిపించింది. ఇది ‘ఆదిత్య 369’ సినిమాలో కనిపించే టైమ్ ట్రావెల్ పరికరం లాగా ఉండడంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గుండ్రటి శకటం ఎక్కడినుంచి వచ్చి పడిందో అని భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా ప్రచారం కావడంతో పెద్ద సంఖ్యలో జనం దీన్ని చూడడానికి తరలి వస్తున్నారు.

కొందరు దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు అది రీసెర్చ్ హీలియం బెలూన్ అని తేల్చారు. వాతావరణ మార్పుల అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు వాటిని గాల్లోకి పంపుతుంటారని తెలిపారు. ఇప్పుడు ఇక్కడ పడిన ఈ బెలూన్ ఫెసిలిటీ ఆఫ్ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పంపించినట్లు తేల్చారు. 

కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో దాడిచేసి.. రూ.27 లక్షల బంగారు నగలు చోరీ..

click me!