హైద్రాబాద్ గోపన్‌పల్లిలో బ్రహ్మణ సేవా సదన్ ప్రారంభించిన కేసీఆర్

Google News Follow Us

సారాంశం

హైద్రాబాద్ గోపన్ పల్లిలో  బ్రహ్మణ సేవా సదన్ ను  తెలంగాణ  సీఎం కేసీఆర్  ఇవాళ  ప్రారంభించారు. 

హైదరాబాద్: రంగారెడ్డి  జిల్లా   శేరిలింగంపల్లి మండలం  గోపన్ పల్లిలో  విప్రహిత  బ్రహ్మణ సదనాన్ని  తెలంగాణ సీఎం  కేసీఆర్  బుధవారంనాడు  ప్రారంభించారు. గోపన్ పల్లిలోని  6 ఎకరాల  10 గంటల స్థలంలో  బ్రహ్మణ సేవా  సదన్  నిర్మించారు.బ్రహ్మణ సమాజ  విస్తృత  ప్రయోజనాల  కోసం ఈ భవనంలో   12  నిర్మాణాలు చేపట్టారు.బ్రహ్మణ సేవా సదనం  ప్రాంగణంలో  చండీ యాగం,  సుదర్శన హోమం నిర్వహించారు. పూర్ణాహుతి తర్వాత  సదనాన్ని  సీఎం  కేసీఆర్  ప్రారంభించారు. బ్రహ్మణుల సంక్షేమానికి  18 మందితో  సంక్షేమ పరిషత్ ను రాష్ట్ర ప్రభుత్వం  ఏర్పాటు  చేసింది.   

also read:దూప, దీప, నైవైద్యం నిధులు రూ. 10 వేలకు పెంపు: కేసీఆర్

బ్రహ్మణ  సేవా సదనంలో కళ్యాణ మండపం,  పీఠాధిపతులు , ధర్మాచార్యుల భక్తి, ఆధ్యాత్మిక  భావజాల వ్యాప్తికి  సమాచార కేంద్రం ఏర్పాటు  చేశారు. ఆధ్యాత్మిక  గ్రంధాలు, వేదాలు , ఉపనిషత్తులు , పురాణాలతో  కూడిన గ్రంధాలయం కూడ నిర్మించారు.