దూప, దీప, నైవైద్యం నిధులు రూ. 10 వేలకు పెంపు: కేసీఆర్

By narsimha lode  |  First Published May 31, 2023, 12:27 PM IST


బ్రహ్మ ణ  పరిషత్  ద్వారా  వేద శాస్త్ర  పండితులకు  ప్రతి నెల  ఇస్తున్న భృతిని  రూ.  5 వేలకు  పెంచుతున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. 



హైదరాబాద్: దూప,దీప, నైవైద్యాల  కింద  నిధులను రూ. 10 వేలకు పెంచుతున్నట్టుగా  కేసీఆర్ ప్రకటించారు. రంగారెడ్డి  జిల్లాలోని  శేరిలింగంపల్లి  మండలం గోపన్ పల్లిలో  బుధవారంనాడు  బ్రహ్మణ సేవా సదన్ ను సీఎం  కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో  ఆయన  ప్రసంగించారు.రాష్ట్రంలోని  మరో  2,896  దేవాలయాలకు  దూప, దీప, నైవేద్యాలు అందించనున్నట్టు సీఎం  కేసీఆర్ చెప్పారు.

బ్రహ్మ ణ  పరిషత్  ద్వారా  వేద శాస్త్ర  పండితులకు  ప్రతి నెల  ఇస్తున్న భృతిని  రూ. 2500 నుండి  రూ.  5 వేలకు  పెంచుతున్నట్టుగా కేసీఆర్  చెప్పారు. ఈ భృతిని పొందే  అర్హత  వయస్సును  75 ఏళ్ల నుండి  65 ఏళ్లకు తగ్గిస్తున్నామని  కేసీఆర్  ప్రకటించారు.  సూర్యాపేటలో  త్వరలో  బ్రహ్మణ భవనం  నిర్మించనున్నట్టుగా కేసీఆర్  వివరించారు. 

Latest Videos

 ద్వాదశ  జ్యోతిర్లింగ క్షేత్రాల  నుండి  వచ్చిన  పండితులకు  సీఎం  కేసీఆర్ స్వాగతం పలికారు. పురవాసుల హితం  కోరేవారే పురోహితులు అని  సీఎం  చెప్పారు. శృంగేరి, కంంచి పీఠాధిపుతల  చరణ పద్మాలకు  వందనాలు చెప్పారు సీఎం.
 
విప్రహిత  బ్రహ్మణ సదనాన్ని రూ. 12 కోట్లతో నిర్మించిన విషయాన్ని  సీఎం  కేసీఆర్ గుర్తు  చేశారు. బ్రహ్మణ సదనం నిర్మించడం దేశంలో  ఇదే మొదటిసారి అని  కేసీఆర్ తెలిపారు. బ్రహ్మణ పరిషత్ కు  ప్రతి ఏటా  రూ. 100  కోట్లు  కేటాయిస్తున్నామని  సీఎం  కేసీఆర్ వివరించారు.  సీఎం  ప్రసంగం ముగిసిన  తర్వాత పలువురు  వేద పండితులను  ఘనంగా  సన్మానించారు.
 

click me!