రెండో విడత కంటి వెలుగు: ఖమ్మంలో ప్రారంభించిన నాలుగు రాష్ట్రాల సీఎంలు

By narsimha lode  |  First Published Jan 18, 2023, 2:26 PM IST

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాలుగు రాష్ట్రాల సీఎంలు ,జాతీయ నేతలు  ఇవాళ ప్రారంభించారు. లబ్దిదారులకు  కళ్లజోళ్లను పంపిణీ చేశారు.


ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రారంభించింది.   నలుగురు సీఎంలు, రెండు పార్టీల జాతీయ నేతలు  ఈ కార్యమాన్ని ప్రారంభించారు.ఖమ్మం నూతన కలెక్టరేట్ కార్యాలయంలో  రెండో విడత  కంటి వెలుగు కార్యక్రమాన్ని   సీఎం కేసీఆర్, కేరళ సీఎం విజరయి విజయన్,  ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్,   పంజాబ్ సీఎం  భగవంత్ సింగ్ మాన్,  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి  డి. రాజా,  సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

కంటి వెలుగు కార్యక్రమం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి. శాంతికుమారిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడిగి తెలుసుకున్నారు.  మూడు రాష్ట్రాల సీఎంలకు  కంటి వెలుగు కార్యక్రమం గురించి  కేసీఆర్ సహా మంత్రి హరీష్ రావు  వివరించారు.  కంటి వెలుగు  కార్యక్రమం ద్వారా పరీక్షలు చేయించుకున్న ఆరుగురు లబ్దిదారులకు  సీఎంలు, జాతీయ పార్టీల నేతలు కళ్లజోళ్లను పంపిణీ చేశారు.  కంటి వెలుగు లబ్దిదారులతో కలిసి  సీఎంలు, నేతలు  ఫోటోలు దిగారు. అనంతరం  బీఆర్ఎస్  నేతలతో పాటు పలువురు మంత్రులను  కేసీఆర్   సీఎంలు, జాతీయ నేతలకు  పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.

Latest Videos

undefined

also read:ఖమ్మం నూతన కలెక్టర్ కార్యాలయం: మూడు రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రారంభించిన కేసీఆర్

రాష్ట్రంలోని  16,533  ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కంటి వెలుగు కింద  కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. కంటి పరీక్షల కోసం  వచ్చే  వారి  నుండి ప్రత్యేక సాఫ్ట్ వేర్  ద్వారా సేకరిస్తారు. పరీక్షల కోసం వచ్చే వారు ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు తెలిపారు.  కంటి చూపు ఆధారంగా  అవసరమైన  కంటి అద్దాల గురించి  వైద్యులు సూచిస్తారు.  రీడింగ్ గ్లాసెస్ అవసరమైన వారికి వెంటనే అందిస్తారు. రీడింగ్ గ్లాసెస్ కాకుండా వైద్యులు సూచించిన కంటి అద్దాల పంపిణీకి సమయం పడుతుంది.  గతంలో  కంటివెలుగు కార్యక్రమాన్ని సుదీర్ఘంగా నిర్వహించారు. కానీ ఈ దఫా  100 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది.  ఈ విడత కంటి వెలుగు కోసం రూ. 200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 

మొదటి విడతలో  రాష్ట్రంలోని  1,54, 72, 860 మందికి పరీక్షలు చేశారు. వీరిలో  44, 08,483 మందికి  కంటి అద్దాలు పంపిణీ చేశారు. 3,10, 638 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇక రెండో విడత కూడా 1కోటి 56 లక్షల మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా  పెట్టుకుంది. 55 లక్షల మందికి  కంటి అద్దాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

 

  
 

click me!