ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

By narsimha lodeFirst Published Jan 29, 2023, 3:28 PM IST
Highlights

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం  ఇవాళ ప్రగతి భవన్ లో  ప్రారంభమైంది. . పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై   ఈ సమావేశంలో  చర్చించారు. 
 

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం  ఆదివారం నాడు  కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైంది.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో   పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై  ఎంపీలకు  కేసీఆర్ దిశా నిర్దేశం  చేస్తున్నారు.   ఇవాళ  మధ్యాహ్నం   రెండు గంటలకు  ఎంపీలు  ప్రగతి భవన్ కు  చేరకున్నారు. ఎంపీలతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం  ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. 

తెలంగాణ రాష్ట్రం పట్ల  కేంద్రం  వివక్ష పూరితంగా వ్యవహరిస్తుందని   బీఆర్ఎస్ ఆరోపస్తుంది. ఈ విషయమై  కేంద్రం నుండి  రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై  కేంద్రంపై పోరాటం చేయనున్నారు. మరో వైపు  రాష్ట్ర విభజన సమయంలో  ఇచ్చిన హమీల విషయమై   కేంద్రంపై  ఒత్తిడికి తీసుకుారున్నారు. గతంలో కూడా పార్లమెంట్  సమావేశాల్లో  బీఆర్ఎస్   పోరాటం చేసిన విషయం తెలిసిందే.   కేంద్రంపై  ఒత్తిడి తీసుకువచ్చేందుకు  ఇతర  పార్టీలు  కలిసివస్తే  ఆ పార్టీలతో కలిసి పోరాటం చేయాలని  బీఆర్ఎస్   భావిస్తుంది.  

 రాఫ్ట్రం నుండి  పెద్ద ఎత్తున  పన్నుల రూపంలో  కేంద్ర ప్రభుత్వానికి  నిధులు  రాష్ట్రం  సమకూర్చినట్టుగా  బీఆర్ఎస్ నేతలు  చెబుతున్నారు. కానీ కేంద్రం నుండి   రాష్ట్రానికి   సరైన నిధులు  ఇవ్వడం లేదని  బీఆర్ఎస్ విమర్శలు  చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి  రాష్ట్రం నుండి పన్నుల రూపేణ వచ్చిన  నిధులు, రాష్ట్రానికి విడుదల చేసిన  విషయమై  తాము చర్చకు సిద్దమని కూడా బీఆర్ఎస్ నేతలు  చెబుతున్నారు. ఈ సబాల్ కు  బీజేపీ నేతలు కూడా ధీటుగా  సమాధానమిస్తున్నారు. రాష్ట్రానికి  నిధులిచ్చినా  కూడా  ప్రభుత్వం  కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తుందని  బీజేపీ నేతలు  ఆరోపిస్తున్నారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో తమ పార్టీ పేరును టీఆర్ఎస్ కు బదులుగా బీఆర్ఎస్ గా మార్చాలని  ఆ పార్టీ ఎంపీలు గత సమావేశాల చివరి రోజునే వినతి పత్రం సమర్పించారు. లోక్ సభ స్పీకర్  ఒంబిర్లా, రాజ్యసభ చైర్మెన్ కు  ా పార్టీ ఎంపీలు వినతిపత్రాలు  అందించారు.  

click me!