కేసీఆర్ మనవుడికి డయానా అవార్డ్..!

Published : Jun 29, 2021, 09:22 AM IST
కేసీఆర్ మనవుడికి డయానా అవార్డ్..!

సారాంశం

కల్తీ లేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణ ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంపై గ్రామాలు స్వయం సమృద్ధి పొందడమెలా అనే విషయాలను వీడియోలో వివరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కి అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్నవారికి అందించే ప్రతిష్టాత్మక డయానా అవార్డు .. ఈ ఏడాది కేసీఆర్ మనవుడు హిమాన్షును వరించింది. 

గ్రామాల స్వయం సమృద్ధి కోసం హిమాన్షు ఇటీవల షోమా పేరుతో ఓ వీడియో రూపొందించారు. కల్తీ ఆహారం పట్ల అవగాహన కల్పిస్తూ.. కల్తీ లేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణ ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంపై గ్రామాలు స్వయం సమృద్ధి పొందడమెలా అనే విషయాలను వీడియోలో వివరించారు.

హిమాన్షు చేసిన ప్రయత్నానికి మెచ్చిన డయానా అవార్డు ఆర్గనైజేషన్ అతడికి అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ లో తెలియజేశాడు. తనకు అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దివంగత బ్రిటన్ యువరాణి డయానా గుర్తుగా.. డయానా అవార్డ్  ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారు. సమాజానికి సేవ చేస్తున్న 9-25 ఏళ్ల మధ్య వయస్కులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?