కేసీఆర్ సర్కార్ శుభవార్త: రైతుబంధు సాయం పెంపు

Published : Jun 01, 2019, 07:35 PM IST
కేసీఆర్ సర్కార్ శుభవార్త: రైతుబంధు సాయం పెంపు

సారాంశం

భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు బంధు పథకం సాయం పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇకపై రైతుకు ఏడాదికి రూ.10వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం కింద చెరో ఐదు వేల రూపాయలు అంటే పదివేలు అందించనుంది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతన్నలకు తీపికబురు అందించారు. రైతు బంధు సాయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం గత పాలన నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం ద్వారా ప్రతీ ఏడాది రూ.4వేలు అందిస్తుంది. అయితే ఆ సాయాన్ని ఇప్పుడు రూ.5వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

అందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు బంధు పథకం సాయం పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇకపై రైతుకు ఏడాదికి రూ.10వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం కింద చెరో ఐదు వేల రూపాయలు అంటే పదివేలు అందించనుంది. 

ఇకపోతే కేంద్రప్రభుత్వం సైతం రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. ప్రతీ ఏడాది రైతుకు పీఎం  కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఏడాదికి రూ.6వేలు చెల్లించాలని కేంద్ర తొలికేబినెట్ లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త: డీఏ పెంచుతూ ఉత్తర్వులు

PREV
click me!

Recommended Stories

NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu
Lakshmi Parvathi: ఎన్టీఆర్ కి నివాళి అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న లక్ష్మీ పార్వతి| Asianet Telugu