హైదరాబాద్‌ పాతబస్తీలో కారు బీభత్సం.. కారు వేగంగా ఢీకొట్టంతో ఎగిరిపడ్డ యువతి

Published : Jun 20, 2022, 12:55 PM IST
హైదరాబాద్‌ పాతబస్తీలో కారు బీభత్సం.. కారు వేగంగా ఢీకొట్టంతో ఎగిరిపడ్డ యువతి

సారాంశం

హైదరాబాద్‌ పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. కమాటిపురాలో రోడ్డుపై వెళ్తున్న యువతి పైకి కారు దూసుకెళ్లింది. కారు వేగంగా ఢీకొట్టడంతో యువతి ఎగిరిపడింది. 

హైదరాబాద్‌ పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. కమాటిపురాలో రోడ్డుపై వెళ్తున్న యువతి పైకి కారు దూసుకెళ్లింది. కారు వేగంగా ఢీకొట్టడంతో యువతి ఎగిరిపడింది. దీంతో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇక, అదే కారు పాదచారులను ఢీకొట్టి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కారు డ్రైవర్ కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Top 5 Startups : హైదరాబాద్ లో ప్రారంభమై గ్లోబల్ స్థాయికి ఎదిగిన టాప్ 5 స్టార్టప్స్ ఇవే
Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?