కోనేరు కృష్ణపై కేసీఆర్ సీరియస్, పోలీస్ అధికారులపై వేటు

By Siva KodatiFirst Published Jul 1, 2019, 10:44 AM IST
Highlights

కొమరంభీం జిల్లాలో అటవీశాఖ అధికారులపై దాడి చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. 

కొమరంభీం జిల్లాలో అటవీశాఖ అధికారులపై దాడి చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ వైఎస్ ఛైర్మన్ కోనేరు కృష్ణపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.

విధి నిర్వహణలో ఉన్న అధికారులపై.. అందులోనూ మహిళపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటన మళ్లీ జరక్కుండా జాగ్రత్తతు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు.

కాగా దాడి సమయంలో ఏ మాత్రం స్పందించని ఇద్దరు పోలీస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు దాడి దృశ్యాలు వైరల్ కావడం, దీనికి తోడు సర్వత్రా విమర్శలు రావడంతో కోనేరు కృష్ణ జడ్పీ వైఎస్ ఛైర్మన్, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.

కోనేరు కృష్ణ తన రాజీనామాను జిల్లా కలెక్టర్‌కు పంపారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఎఫ్ఆర్‌వో అనితపై దాడి చేసిన కేసులో కోనేరు కృష్ణ సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అటవీశాఖ అధికారులపై దాడి తర్వాత రైతులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బ్రీఫింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్న ఆడియో టేప్ కాగజ్‌నగర్‌లో వైరల్ అవుతోంది. 

click me!