గుడ్‌న్యూస్: ఉపాధ్యాయ, పోలీసు శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

Published : Dec 13, 2020, 04:40 PM IST
గుడ్‌న్యూస్: ఉపాధ్యాయ, పోలీసు శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

సారాంశం

 ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. 

హైదరాబాద్: ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం.వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.  వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉందన్నారు.  

ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు కేసీఆర్.

ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇవాళ  ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు సీఎస్ ను ఆదేశించారు. 

 


 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu