పేద‌ల‌ను దోచుకునేందుకే రెండు చోట్ల పోటీ.. కేసీఆర్ పై కాంగ్రెస్ నేత ఘాటు వ్యాఖ్య‌లు

By Mahesh Rajamoni  |  First Published Sep 25, 2023, 3:29 PM IST

Kamareddy: కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ పీఏసీ కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్.. గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ.. టీఎస్ పీఎస్సీ సభ్యులందరినీ తొలగించాలనీ, అక్రమాలకు బాధ్యులైన అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ -1 పరీక్షలు రద్దు కావడం ఇది రెండోసారి కావడంతో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ మ‌రోసారి బీఆర్ఎస్ స‌ర్కారు, తెలంగాణ ముఖ్య‌మంత్రి  కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా షబ్బీర్ అలీ మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డిలో పేదలకు చెందిన మిగిలిన అసైన్డ్ భూములను దోచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్, సిద్దిపేట రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు.  ఇప్పటికే జంగంపల్లి గ్రామంలో కవిత పేరిట వందలాది ఎకరాలు, లచ్చపేటలో 459 ఎకరాలు కేటీఆర్ పేరిట రిజిస్టర్ అయ్యాయ‌ని పేర్కొన్నారు.

పేద‌ల భూముల‌ను లాక్కోవడానికే కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారన్నార‌ని ఆరోపించారు. కామారెడ్డిలో ఓటమి భయంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ తన బంధువులతో మంతనాలు జరుపుతున్నారని చెప్పారు. ఆరు హామీ పథకాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు.  కామారెడ్డి ప్రజలు తనను ఆశీర్వదిస్తున్నారనీ, తనను గెలిపిస్తే రుణం తీర్చుకుంటానని షబ్బీర్ అలీ తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మేన‌నీ, తాము ఇచ్చిన అన్ని హామీల‌ను కాంగ్రెస్ నెర‌వేరుస్తుంద‌ని తెలిపారు.

Latest Videos

undefined

అంత‌కుముందు కూడా టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప‌రీక్ష ర‌ద్దు అంశం గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. గ్రూప్-1 పరీక్ష ప్రక్రియలో అవకతవకలు జరిగాయని హైకోర్టు రద్దు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ పీఏసీ కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్ తీవ్రంగా ఖండించారు. అలాగే, హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ..  టీఎస్ పీఎస్సీ సభ్యులందరినీ తొలగించాలనీ, అక్రమాలకు బాధ్యులైన అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ -1 పరీక్షలు రద్దు కావడం ఇది రెండోసారి కావడంతో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తూ ఇప్పుడు తీవ్ర నిరాశను ఎదుర్కొంటున్న ఉద్యోగార్థుల పట్ల కాంగ్రెస్ నేత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయాన్ని ఆయన గట్టిగా సమర్థిస్తూ.. గ్రూప్-1 పరీక్షలకు తమ పిల్లలకు కోచింగ్ ఇచ్చేందుకు తమ శ్రమను, వనరులను వెచ్చించిన తల్లిదండ్రుల అంకితభావాన్ని లేవ‌నెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం వారి శ్రమను దోచుకుంటోందనీ, వారి పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని విమర్శించారు. పరీక్షార్థులందరికీ తక్షణమే రూ.2లక్షలు నష్టపరిహారం చెల్లించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.హైకోర్టు తీర్పు ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను తమ గ్రామాల్లోకి రాకుండా నిరుద్యోగ యువత నిరసన తెలుపుతుందని హెచ్చరించారు.

click me!