మనోహరాబాద్‌లో చెరువులో నలుగురు గల్లంతు.. ముగ్గురి మృతదేహాల వెలికితీత, బాలుడి కోసం గాలింపు..

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం చోటుచేసుకుంది. 

Google News Follow Us

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో నలుగురు గల్లంతయ్యారు. చెరువులో స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతు  కాగా.. అతడిని కాపాడేందుకు ఒక మహిళ యత్నించింది. ఈ క్రమంలోనే మహిళ గల్లంతైంది. మరో ఇద్దరు మహిళలు కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నించి గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళలు మృతిచెందారు. ముగ్గురు మహిళల మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. చెరువులో గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.