కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: ఈటల, హరీష్‌రావుపై రాని స్పష్టత

By narsimha lodeFirst Published Feb 18, 2019, 6:21 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేసిన నేతలతో భేటీ అయ్యారు

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేసిన నేతలతో భేటీ అయ్యారు.  కేబినెట్‌లో బెర్త్ కోసం ఆశగా ఉన్న ఎమ్మెల్యేలు సీఎంఓ నుండి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు రేపటి మంత్రివర్గంలో కేటీఆర్ కు ఛాన్స్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. కేటీఆర్‌కు ఛాన్స్ దక్కని పరిస్థితుల్లో  హరీష్ రావుకు కూడ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్ మంత్రివర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.  సోమవారం నాడు ప్రగతి భవన్‌లో వీరు భేటీ అయ్యారు.

మరో వైపు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు సీఎం కార్యాలయం నుండి  ఫోన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.మహిళా కోటా నుండి పద్మా దేవేందర్ రెడ్డికి చాన్స్  దక్కే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే రేపటి మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్‌కు ఛాన్స్ ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలోనే హరీష్‌ రావుకు కూడ ఛాన్స్ ఉండకపోవచ్చని సమాచారం. మరో వైపు సీనియర్ నేత ఈటల రాజేందర్ విషయమై కూడ ఇంకా స్పష్టత రాలేదు.గత టర్మ్‌లో కూడ కేసీఆర్ కేబినెట్‌లో  ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు.

ఈ దఫా ఎనిమిది లేదా 10 మందికి చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. అయితే 16 మంది మంత్రులు ప్రమాణం చేసేందుకు వీలుగా సర్కార్ ఏర్పాట్లు చేసింది.

సంబంధిత వార్తలు

పూర్తిస్థాయి విస్తరణకే కేసీఆర్ రెడీ: కాబోయే మంత్రుల భేటీ


 

click me!