కేసిఆర్ దొరికిన దొంగ

First Published Jan 25, 2018, 2:16 PM IST
Highlights
  • పార్లమెంటరీ సెకట్రరీలుగా చేసిన వారిపై వేటు వేయాలి
  • కేబినెట్ హోదా దుర్వినియోగం చేశారు
  • రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక పంపుతాడని నమ్ముతున్నాం
  • టిఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం

తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోసారి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పంచారు. కేసిఆర్ దొరికిన దొంగ అని తీవ్రంగా మండిపడ్డారు. గురువారం శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో కలిసి రేవంత్ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. గతంలో పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేసిన ఆరుగురితోపాటు లాభదాయక పదవుల జాబితాలో ఉన్న మరో ముగ్గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వేటు వేయాలని వారు కోరారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ గతం లో పార్లమెంటరీ సెక్రెటరీగా పనిచేసినవారిపై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వేటు వేయాలని గవర్నర్ కు పిటిషన్ ఇచ్చాము. గవర్నర్ కు ఇచ్చింది వినతిపత్రం కాదు పిటిషన్. మేమిచ్చిన పిటీషన్ పై గవర్నర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 15శాతానికి మించి మంత్రులు గా ఉండటం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధంగా కెసిఆర్ ఎమ్మెల్యేలను పార్లమెంట్ సెక్రెటరీలుగా నియమించారు. హైకోర్టు ప్రశ్నించడంతో ఆరుగురు పార్లమెంట్ సెక్రటరీ లుగా తప్పించారు. కానీ వారిపై వేటు వేయలేదు. ఇలా చట్ట ఉల్లంఘన చేసిన ఢిల్లీ లో ఆప్ ఎమ్మెల్యే లపై రాష్ట్రపతి వేటువేశారు. తెలంగాణ లో అదే ఉల్లంఘన కు పాల్పడిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి. తెలంగాణ లో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలుచేస్తున్నారు. మా పిటిషన్ ను గవర్నర్ రాష్ట్రపతి పంపిస్తారని నమ్ముతున్నాం.

ఆ పార్లమెంటరీ సెక్రటరీ లపై వేటు వేయడంతో పాటు వారు తీసుకున్న జీత భత్యాలను రికవరీ చేయాలి. కేసీఆర్ కు చట్టం, ప్రజలు, న్యాయస్థానాలంటే లెక్కేలేదు. త్వరలోనే మరోసారి రాష్ట్రపతి, సీఈసీ లను కలుస్తాం. కేసీఆర్ దొరికిన దొంగ. టీఆరెస్ తప్పుంది కాబట్టే గులాబీ కూలి,పార్లమెంటరీ సెక్రటరీ లపై నోరు మెదపడంలేదు. గులాబీ కూలిపై ప్రధాని ఆఫీస్ అడిగినా ...రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. గులాబీ కూలీ పై తేలుకుట్టిన దొంగలుగా టీఆరెస్ నేతలు సైలెంట్ గా ఉన్నారు. గులాబీ కూలీ పేరుతో టీఆరెస్ నేతలు కోట్ల దోపిడీ చేశారు. టీఆరెస్ పార్టీ గుర్తింపు రద్దు చేసే దాకా గులాబీ కూలీ పై పోరాడుతా అని స్పష్టం చేశారు.

click me!