మోదీ నా కాళ్లు విరగ్గొటారు: కేసీఆర్

Published : Mar 15, 2017, 10:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
మోదీ నా కాళ్లు విరగ్గొటారు: కేసీఆర్

సారాంశం

పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై సీఎం వ్యాఖ్య

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్... ప్రధాని మోదీని ఉద్దేశించి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

 

ప్రధానమంత్రి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభావం రాష్ట్రంపై పడిందని తెలిపారు.

 

మోటారు వాహనాల పన్ను పడిపోయిందన్నారు. శాసన మండలిలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.

 

ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగిన సమయంలో ప్రధాని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం షాక్ లా తగిలిందని ఆదాయం ఊపందుకున్న సమయంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి, కొత్త నోట్ల అందుబాటు కూడా తక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు.

 

దీంతో  తన కాళ్లు విరగ్గొట్టినట్లు అయ్యిందన్న విషయాన్ని (ఆప్‌నే మేరే టాంగ్ తోడ్‌ దియే) తాను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించానని తెలిపారు.

 

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధానమంత్రిని కలసిని మొదటి సీఎంను తానేనని గుర్తు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్