టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

Published : Apr 01, 2019, 05:08 PM IST
టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

సారాంశం

మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం నాడు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్‌లో చేరారు.  

మెదక్: మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం నాడు టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్‌లో చేరారు.

సోమవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేతలకే విశ్వాసం లేకుండాపోయిందని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగు నీరు అందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.కార్యకర్తలంతా కలిసి మెలిసి ఉండాలని ఆమె కోరారు.మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి  టీఆర్ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని టీఆర్ఎస్ నేతలు  హామీ ఇచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!