జూపల్లి ఇంట్లో పెళ్లి సందడి: కేసీఆర్ సహా విఐపీల హాజరు

Published : May 17, 2019, 03:18 PM ISTUpdated : May 17, 2019, 03:22 PM IST
జూపల్లి ఇంట్లో పెళ్లి సందడి: కేసీఆర్ సహా విఐపీల హాజరు

సారాంశం

హైద్రాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్ లో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జూపల్లి జగపతి రావు కూతురు లక్ష్మి వివాహం శుక్రవారం నాడు నృపూల్‌తో జరిగింది.


హైదరాబాద్:హైద్రాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్ లో మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సోదరుడు జూపల్లి జగపతి రావు కూతురు లక్ష్మి వివాహం శుక్రవారం నాడు నృపూల్‌తో జరిగింది.

ఈ వివాహనికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు,తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్,జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ,ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ వివాహానికి హాజరైన సమయంలో  జూపల్లి రామేశ్వరరావు ఆయనకు ఎదురెల్లి స్వాగతం పలికారు. కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య కూర్చొని జూపల్లి రామేశ్వరరావు కబుర్లు చెప్పారు.నూతన దంతపతులను ఆశీర్వదించేందుకు పెద్ద ఎత్తున బంధు మిత్రులు హాజరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu