బొగ్గు అమ్మకాల్లో టాప్...కేటీఆర్ ట్వీట్

Published : May 17, 2019, 12:50 PM IST
బొగ్గు అమ్మకాల్లో టాప్...కేటీఆర్ ట్వీట్

సారాంశం

బొగ్గు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి సాధించామని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


బొగ్గు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి సాధించామని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయకత్వంలో సింగరేణి కలరీస్ గడిచిన ఐదేళ్లలో బొగ్గు అమ్మకాల విషయంలో గొప్ప వృద్ధి సాధించిందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

బొగ్గు అమ్మకాలలో రూ. 11,928 కోట్ల నుంచి రూ. 25,828 కోట్ల వృద్ధి, లాభాల్లో రూ. 419 కోట్ల నుంచి రూ. 1600 కోట్ల వృద్ధి సాధించినట్లు కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అమ్మకాల్లో 117 శాతం వృద్ధి నమోదు కాగా, లాభాలు 280 శాతం పెరిగాయని ఆయన తెలిపారు.  ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ శ్రీధర్‌, ఉద్యోగులకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?