టీఆర్ఎస్ పాలనను రజాకార్ల పాలనతో పోలుస్తూ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. కేసీఆర్ అహంకరాపూరితుడని, ఆయన అహంకారాన్ని తగ్గించాలంటే హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని అన్నారు. ఈటల గెలిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు.
కరీంనగర్: BJP రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ TRS అధినేత కేసీఆర్‌పై మండిపడ్డారు. KCR అహంకారి అని విమర్శించారు. కుక్కను నిలబెట్టినా ఎన్నికల్లో గెలిపిస్తారు అనేంత అహంకారం ఆయనలో ఉన్నదని అన్నారు. ఆయన అహంకారానికి విరుగుడు ఈటల గెలుపేనని చెప్పారు.
Huzurabad Bypoll సమీపించిన తరుణంలో బీజేపీ నేత Tarun Chugh కరీంనగర్ జిల్లాకు వచ్చారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలనను రజాకార్ల పాలనతో పోల్చారు. రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ అహంకారతత్వాన్ని వ్యతిరేకించే ఈటల పార్టీ నుంచి బయటకు వచ్చారని వివరించారు. డబ్బుతో ఏదైనా సాధించగలమన్నా భ్రమలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్యం ఒప్పందం నడుస్తున్నదని ఆరోపించారు.
undefined
Also Read: Huzurabad Bypoll: రేపటినుండే ఈటల సానుభూతి డ్రామా షురూ... ఇలా సాగనుంది..: బాల్క సుమన్ సంచలనం
రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించడం లేదని, ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌లోనే గడుపుతున్నారని తరుణ్ చుగ్ అన్నారు. ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి చేపడుతామని వివరించారు. నియోజకవర్గంలో యువకుల కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని చేపడతామని తెలిపారు. రోడ్లు లేని గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అంతేకాదు, ఈటలను గెలిపిస్తే అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని, ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలనూ చేపడతామని తెలిపారు.