హుజురాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 20మంది మహిళలకు గాయాలు, నలుగురి పరిస్థితి విషమం (వీడియో)

By Arun Kumar PFirst Published Oct 26, 2021, 4:48 PM IST
Highlights

హుజురాబాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న మహిళలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 20మంది మహిళలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. టీఆర్ఎస్ మీటింగ్ లో పాల్గొని తిరిగి వెళుతున్న దాదాపు 20 మంది మహిళలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహిళలు వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో మహిళలందరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురు మహిళల పరిస్థితి విషమంగా వుంది. 

ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. huzurabad bypoll ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో అన్నిపార్టీలు ముమ్మరంగా campaign నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే TRS party నిర్వహించిన ప్రచార  కార్యక్రమంలో హుజురాబాద్ మండలం ఇందిరానగర్ కు చెందిన మహిళలు పాల్గొన్నారు. 

టీఆర్ఎస్ ప్రచార కార్యాక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 20మంది మహిళలు ఓ ఆటోలో వెళ్ళారు. వీరంతా తిరిగి వస్తుండగా హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రెండు వాహనాలు అధిక వేగంతో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో ఆటోలోని మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. 

వీడియో

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అంబులెన్స్ లు గాయపడిన వారిని హుజురాబాద్  కు తరలించాయి. అక్కడ వారందరికీ చికిత్స అందిస్తున్నారు. 

పది మందికి తీవ్ర గాయాలవగా నలుగురి పరిస్థితి విషమం వున్నట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోస వరంగల్ కు తరలించారు. మిగతా మహిళలకు కూడా స్వల్పంగా గాయాలవగా వారు కూడా చికిత్స పొందుతున్నారు.

READ MORE  Huzurabad Bypoll: అన్నీ ఇలాగే కొనసాగాలంటే... గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి: మంత్రి తలసాని

ప్రమాదంపై సమాచారం అందింనవెంటనే అధికార టీఆర్ఎఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. దగ్గరుండి మరీ gellu srinivas yadav క్షతగాత్రులను అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కు తరలించారు. అలాగే హాస్పిటల్ వద్ద కూడా గాయపడిన మహిళలకు ధైర్యం చెబుతూ  కనిపించారు గెల్లు శ్రీనివాస్.  

స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు తెలిపారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ మహిళలతో పాటు ప్రత్యక్ష సాక్షుల ద్వారా ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. గాయపడిన వారి వివరాలను సేకరించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

 ఈ నెల 30వ తేదీన హుజురాబాద్ లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48గంటలు ముందుగానే ప్రచారానికి తెరపడనుంది. దీంతో బుధవారం సాయంత్రం వరకే ప్రచారానికి సమయం వుండటంతో హుజురాబాద్ అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ మీటింగ్ లో పాల్గొన్న మహిళలు తిరిగివెళుతూ ప్రమాదానికి గురయ్యారు.


 

click me!