కేసీఆర్ ఆలోచన, తెరపైకి తెలంగాణ ‘‘గ్రీన్‌ఫండ్‌’’... ఎంపీల నుంచి పిల్లల వరకు కాంట్రీబ్యూషన్

By Siva KodatiFirst Published Oct 1, 2021, 3:46 PM IST
Highlights

రాష్ట్రంలో గీన్ ఫండ్ పేరిట ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు ప్రతినెల వారి వేతనం నుంచి రూ.100 విరాళంగా ఇస్తామని చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలో గీన్ ఫండ్ పేరిట ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు ప్రతినెల వారి వేతనం నుంచి రూ.100 విరాళంగా ఇస్తామని చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని గెజిటెట్ ఆఫీసర్లు, టీచర్లు, ఇతర ప్రభుత్వోద్యోగులు వారి వేతనం నుంచి ప్రతి నెల రూ.25 ఇచ్చేందుకు ముందుకు వచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. దీనితో పాటు 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభలలో 24 మంది ఎంపీలు వున్నారని సీఎం చెప్పారు. వీరు ప్రతి నెలా రూ.500 హరిత నిధి కింద విరాళంగా ఇవ్వాలని ప్రతిపాదన చేశారని కేసీఆర్ వెల్లడించారు. తమ పార్టీ తరపున అందరూ దీనికి అంగీకరించారన... మిగిలిన పార్టీల నేతలతో కూడా తాను మాట్లాడానని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలోని వాణిజ్య కార్యక్రమాల కోసం లైసెన్స్ రెన్యూవల్ కోసం వచ్చే వారు రూ.1000 జమ చేయాలనే నిబంధన పెట్టుకుంటే మరికొంత నగదు జమ చేయాలని కేసీఆర్ కోరారు. అలాగే భూముల రిజిస్ట్రేషన్ సమయంలోనూ హరిత నిధి కింద రూ.50 వసూలు చేయాలని ప్రతిపాదన చేశామని సీఎం చెప్పారు. స్కూలు విద్యార్ధులను సైతం హరితహారంలో భాగస్వామ్యం చేసేందుకు గాను స్కూలు పిల్లలు రూ.5, హైస్కూల్ విద్యార్ధులు రూ.15, ఇంటర్మీడియట్ విద్యార్ధులు రూ.25, డిగ్రీ విద్యార్ధులు రూ.50, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్ధులు రూ.100 లను అడ్మిషన్ టైంలో చెల్లించాలని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పటికే హరిత హారానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించిందని సీఎం తెలిపారు. 

click me!