పోడు భూముల సమస్య: పరిష్కారం కేంద్రం చేతుల్లో... త్వరలోనే అసెంబ్లీలో తీర్మానం

By Siva KodatiFirst Published Oct 1, 2021, 3:17 PM IST
Highlights

పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం చట్టం చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మన దగ్గర కూడా సర్వేలు జరిగాయని కొందరికి పట్టాలు కూడా ఇచ్చామని సీఎం వెల్లడించారు. 

పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం చట్టం చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మన దగ్గర కూడా సర్వేలు జరిగాయని కొందరికి పట్టాలు కూడా ఇచ్చామని సీఎం వెల్లడించారు. 96,676 మంది గిరిజనులకు 3.8 లక్షల భూమిని పట్టాలుగా ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. రైతు బంధును గిరిజనులకు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. పోడు భూముల వ్యవహారాన్ని తేలుస్తామని తాము కూడా ప్రజలకు హామీ ఇచ్చామని.. దీనిపై త్వరలోనే ఫోకస్ పెడతామని సీఎం అన్నారు. అధికారులు, గిరిజనుల మధ్య కొట్లాటలు వుండకూడదని కేసీఆర్ ఆకాంక్షించారు.

దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే గిరిజనులకు ఇచ్చింది కాకుండా ఇంకా ఇదే సమస్యలను ఎదుర్కొంటున్న గిరిజనులకు పట్టాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనిపై కేంద్రానికి ఒక తీర్మానం పంపుతామని.. అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని సీఎం చెప్పారు. తెలంగాణ గిరిజనులపై రెండు రకాల దాడులు జరుగుతున్నాయని కేసీఆర్ వెల్లడించారు. ఆదిలాబాద్‌లో మహారాష్ట్రకు చెందిన లంబాడీలు దాడులు చేస్తున్నారని సీఎం చెప్పారు. దీని వల్ల తెలంగాణ గిరిజనులు కొన్ని హక్కుల్ని కోల్పోతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!