హైదరాబాద్ ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం, విభజన సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశమయ్యారు. కృష్ణా-గోదావరి నదులు అనుసంధానం, విభజన సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.
అంతకు ముందు ప్రగతి భవన్‌కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్, మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రధానంగా గోదావరి నది జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఇదే విషయమై ఇప్పటికే మూడు దఫాలు రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించారు. వాస్తవానికి ఎల్లుండి రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించాలని భావించారు.కానీ, ఈ సమావేశాన్ని ఒక్క రోజు ముందుకు జరిపారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు.నది జలాలను సద్వినియోగం చేసుకొనే విషయమై సీఎంల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.