కేసీఆర్ తర్వాత కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని కవిత అన్నారు. అదే విషయాన్ని ఇటీవల మంత్రి శ్రీనివాస గౌడ్ కూడా చెప్పారు శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు కూడా.
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా మానుకోట పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవిత అభివర్ణించారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని ఆమె అన్నారు
కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ ముందుకు తీసుకుని వెళ్తూనే ఐటి, పురపాలక శాఖల మంత్రిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు .రాజ్యసభ సభ్యుడు సంతోష్ గ్రీన్ చాలెంజ్ ను ఆమె స్వీకరించారు.
also Read: కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలనం
అందులో భాగంగా కవిత మహబూబాబాద్ లో బుధవారంనాడు మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత పార్లమెంటు పరిధిలోని నర్సంపేట, డోర్నకల్, పినపాక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, రెడ్యా నాయక్, రేగ కాంతారావులకు ఆమె గ్రీన్ చాలెంజ్ విసిరారు.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ చర్చకు తెర లేపిన విషయం తెలిసిందే. కేసీఆర్ తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. దానిపై కేటీఆర్ కూడా స్పందించారు. మరో పదేళ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు.
Also Read: మరో పదేళ్లు కేసీఆరే సీఎం, కాంగ్రెస్‌ను ఇగ్నోర్ చేయలేం: కేటీఆర్ ఆసక్తికరం