నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కవిత కోరినట్టే ఆమెను 11వ తేదీన హాజరు కావాల్సిందిగా ఈడీ రిప్లై ఇచ్చింది.
హైదరాబాద్ : ఎట్టకేలకు కవిత విచారణను 11కు వాయిదా వేస్తూ ఈడీ స్పష్టతనిచ్చింది. నేడు ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కావాలని బుధవారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె 11న హాజరవుతానంటూ ఈడీకి లేఖ రాశారు. ఈ రోజు ఉదయం వరకు దీనిమీద ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు గత రాత్రే కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు.
ఈ వార్త వెలుగులోకి రాగానే.. ఈడీ విచారణ లేనట్టేనా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించడంతో.. ఈడీ విచారణకు కవిత హాజరు కావడం లేదా? ఈడీనుంచి కవిత ఈమెయిల్ కు రిప్లై వచ్చిందా? ఏం జరగబోతోంది అనే అంశం ఉత్కంఠగా మారింది. ఓ వైపు ఇప్పటివరకు ఈడీ నుంచి ఎలాంటి స్ఫష్టత రాలేదు. ఇంకోవైపు ఆమె విచారణ ఎల్లుండికి వాయిదా వేసినట్టుగా కవితకు సమాచారం వచ్చిన తరువాతే ప్రెస్ మీట్ పెడుతున్నట్లుగా అంటున్నారు. ఈ క్రమంలో అసలేం జరగబోతోంది. ఒంటిగంటకు ప్రెస్ మీట్ ఉంటుందా? కవిత ఈడీ విచారణకు హాజరవుతుందా? విచారణ తరువాత కవితను అదుపులోకి తీసుకుంటారన్న ఊహాగానాలు నిజమవుతాయా? అనేది రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.
మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్? ఈడీ విచారణ లేనట్టేనా?
ఈ గందరగోళానికి తెర దించుతూ ఈ నెల 11న తేదీన విచారణకు ఈడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను 11వ తేదీ హాజరవుతానంటూ కవిత చేసిన ఈ మెయిల్ కు ఓకే అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ అంశంలో స్పష్టత వచ్చింది. మార్చి 11న జంతర్ మంతర్ దగ్గర.. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద జరగనున్న ధర్నా యధావిథిగా జరగనుంది. ఆ తరువాత కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కవిత.. మహిళా రిజర్వేషన్ అంశాలు, ఢిల్లీ లిక్కర్ స్కాంల మీద ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నట్లుగా సమాచారం.
I will be appearing before the Enforcement Directorate in New Delhi on March 11, 2023. https://t.co/OjAuzJZytS
— Kavitha Kalvakuntla (@RaoKavitha)