కౌశిక్ రెడ్డికి భారీ జరిమానా..!

Published : Jul 22, 2021, 09:09 AM ISTUpdated : Jul 22, 2021, 11:16 AM IST
కౌశిక్ రెడ్డికి భారీ జరిమానా..!

సారాంశం

ఎలాంటి అనుమతులు లేకుండా.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. అధికారులు జరిమానా విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.  

కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. ఆ పార్టీని వీడి.. టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.3లక్షల జరిమానా విధించారు.

కౌశిక్ రెడ్డి.. ఎలాంటి అనుమతులు లేకుండా.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. అధికారులు జరిమానా విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ ను వీడిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు . ఈ నేపథ్యంలో తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యానర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై నగర ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయడంతో భారీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?