
తనకు తెలంగాణ కట్టు, బొట్టు తెలుసునన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె పార్టీ అధికార ప్రతినిధి ముస్తఫా ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్తఫా కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు . ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని అల్లాని వేడుకున్నారు. అనంతరం షర్మిల తిరిగి లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. వైఎస్ షర్మిల రాకతో ముస్తఫా నివాసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది.