హైద్రాబాద్ లో దారుణం: రూ. 400 కోసం హత్య

Published : Dec 25, 2022, 12:34 PM IST
హైద్రాబాద్ లో దారుణం:  రూ. 400 కోసం  హత్య

సారాంశం

హైద్రాబాద్ బాలానగర్ లో ఇవాళ దారుణం చోటు  చేసుకుంది.  రూ. 400 కోసం   శ్రీనివాస్ అనే వ్యక్తిని  కాశీరాం హత్య చేశాడు. 

హైదరాబాద్: నగరంలో  హైద్రాబాద్ లో  ఆదివారంనాడు దారుణం చోటు చేసుకుంది. రూ. 400ల కోసం  శ్రీనివాస్ అనే వ్యక్తిని  కాశీరాం అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైద్రాబాద్  బాలానగర్ లో కలకలం రేపింది.హైద్రాబాద్ బాలానగర్ లో  కాశీరాం,  శ్రీనివాస్  కూలీలుగా పనిచేస్తున్నారు.  వీరిద్దరి మధ్య రూ. 400ల కోసం  గొడవ జరిగింది.   ఇవాళ  ఉదయం   బాలానగర్  పుట్ పాత్ వద్ద  కాశీరాం, శ్రీనివాస్ మధ్య  గొడవ జరిగింది.  బాలానగర్ లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద  కర్రతో  శ్రీనివాస్ పై  కాశీరాం విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు  అప్పటికి తన  కోపం  చల్లారకపోవడంతో  అటుగా  వస్తున్న లారీ కిందకు శ్రీనివాస్ ను తోసివేశాడు. దీంతో  శ్రీనివాస్ లారీ కింద  పడి  అక్కడికక్కడే మృతి చెందాడు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్
CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్