కొత్త సచివాలయంపై కర్నె ప్రభాకర్ చెప్పిన కొత్త వాస్తు ఇదే

Published : Sep 07, 2017, 05:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కొత్త సచివాలయంపై కర్నె ప్రభాకర్ చెప్పిన కొత్త వాస్తు ఇదే

సారాంశం

పాత సచివాలయంలో పాత భవనాలున్నాయి సౌకర్యాలు లేవు, క్యాంటీన్ బాగాలేదు. వెయ్యి మందితో మీటింగ్ పెట్టే అవకాశం లేదు బైసన్ మైదానంలో అయితే ఉత్తర దక్షిణ తెలంగాణలకు మధ్య ఉంటది

కొత్త సచివాలయం ఎందుకోసం కడుతున్నారనేదానికి ప్రభుత్వం నుంచి ఎన్నిరకాల వివరణ ఇచ్చినా రాజకీయ పార్టీలు సంతృప్తి చెందడంలేదు. ఇప్పటికే పెద్ద ప్రదేశంలో సచివాలయం ఉండగా దానికితోడు ఎపి భవనాలు కూడా అందుబాటులోకి వస్తుండగా కొత్త సచివాలయం అవసరం ఏమందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. దీంతోపాటు గతంలో 16 మంది సిఎంల కొడుకులెవరూ సిఎంలు కాలేదని అందుకే ఆ కోణంలో వాస్తుదోషం ఉందని నమ్మి కేసిఆర్ సచివాలయాన్ని తరలిస్తున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి కొత్త పల్లవి ఎత్తుకున్నారు.  ఇక కొత్త సచివాలయం ఎందుకోసం కడుతున్నారో కొత్త వాదనను ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెర మీదకు తెచ్చారు. ఆ వాదనేందో మీరే చదవండి.

కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న 38 ఎకరాల బైసన్ పోలో గ్రౌండ్ ను సీఎం కెసిఆర్ తన శక్తి యుక్తులతో రాష్ట్రానికి సాధించి పెట్టారు. గతంలో పంద్రాగస్టు, రిపబ్లిక్ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రతీ సారీ రక్షణ శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని సాధించినందుకు సీఎం కెసిఆర్ ను అభినందిచాల్సింది పోయి కాంగ్రెస్, దానికి అనుబంధంగా పనిచేస్తున్న టీడీపీ ,బీజేపీ ,కమ్యూనిస్టు పార్టీ లు చిల్లర రాజకీయం చేస్తున్నాయి . బైసన్ పోలో 38 ఎకరాల స్థలంలో సెక్రటేరియట్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించాలని సీఎం కెసిఆర్ ఇప్పటికే నిర్ణయించారు . విపక్షాల ఏడుపు దేనికి ? అద్భుతమైన సచివాలయ నిర్మాణం జరిగితే కెసిఆర్ కు పేరొస్తుందనా ? లేదంటే సచివాలయ నిర్మాణానికి ఖర్చవుతుందనా ?

విపక్షాల చేస్తున్న డబ్బు దుబారా ఆరోపణలు శుద్ధ తప్పు. సచివాలయానికి అనుబంధంగా హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల 119 శాఖాధిపతుల కార్యాలయాలు, మరో 89 ఇతర కార్యాలయాలు నడుస్తున్నాయి . ఆ భవనాల అద్దెకు, కరెంటు, రవాణా ఇతర సౌకర్యాల కల్పనకు సాలీనా 32 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతోంది. కొత్త సచివాలయ నిర్మాణం ఖర్చు 200 నుంచి 250 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే సచివాలయ సంబంధ భవనాలకు చెల్లించే దాదాపు పదేళ్ల అద్దెతో సమానం. సెక్రటేరియట్ కు పదేళ్ల అద్దెతో శాశ్వత భవనం వస్తుంటే విపక్షాలకు కడుపు మంట ఎందుకో ? సేవ్ బైసన్ పోలో అంటూ విపక్షాలు అర్ధం లేని ఆందోళనలు చేస్తున్నాయి . బైసన్ పోలో స్థలం లో ఇపుడు ప్రజోపయోగ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా ? కేవలం ఎన్సీసీ క్యాంపులు అక్కడ జరుగుతున్నాయి . ఇపుడున్న సచివాలయం లో అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ తిరిగేందుకు కనీసం స్థలం కూడా లేదు.

సచివాలయం లో నిజాం కాలం నాటివి 50 సంవత్సరాలు, 15 యేండ్ల కింద కట్టిన భవనాలు పిట్ట గూళ్ళలా శిథిలావస్థలో ఉన్నాయి. సెక్రటేరియట్ కు గుండె కాయలాంటి సాధారణ పరిపాలన శాఖ ,విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ ప్రధాన కార్యాలయాలు కూడా ఇప్పటి సచివాలయం లో లేవు. అవి వేరే చోట పని చేస్తున్నాయి . సచివాలయం లో 2 వేల మంది ఉద్యోగుల పని చేస్తుంటారు. వారికి ఇప్పటి భవనంలో కనీస సౌకర్యాలు లేవు. సీ ఏస్ వెయ్యిమంది ఉద్యోగులతో సమావేశం పెట్టాలంటే అందుకు సరిపడా కాన్ఫరెన్స్ హాల్ కూడా లేదు. ఉద్యోగులకు మంచి క్యాంటీన్ కూడా లేదు ...ఏదైనా శిక్షణా కార్యక్రమం పెట్టాలంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కు వెళ్లాల్సి వస్తోంది . ప్రస్తుత సచివాలయంలో డిస్పెన్సరీ ,లైబ్రరి ,బ్యాంకు ,పోస్ట్ ఆఫీస్ లాంటివి అక్కడక్కడా విసిరేయబడ్డట్టు ఉన్నాయి. విభజనలో భాగంగా తెలంగాణ సచివాలయానికి పది ఎకరాల 29 గుంటల ప్రాంగణం లో ఉన్న నాలుగు బ్లాక్ లే కేటాయించబడ్డాయి . 3 లక్షల 85 వేల 550 చదరపు అడుగుల సచివాలయాన్నే ప్రస్తుతం వినియోగించుకుంటున్నాం .

అన్ని సౌకర్యాలతో సచివాలయ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కావాలంటే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే నిర్మాణం జరగాలి. అన్నీ అంశాలు పరిగణన లోకి తీసుకునే సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్ ను ఎంపిక చేశాం . బైసన్ పోలో గ్రౌండ్ లో వచ్చే సచివాలయం ఉత్తర, దక్షిణ తెలంగాణ కు మధ్య లో ఉంటుంది. హైదరాబాద్ నలుదిశలా ఉన్న పటాన్ చెరు, ఎల్బీ నగర్ ,పహాడీ షరీఫ్ ,అల్వాల్ నుంచి వచ్చే వారికి రవాణా విషయం లో బైసన్ పోలో సౌకర్య వంతంగా ఉంటుంది ...మెట్రో రైలు సౌకర్యం ,బస్సు ,రైలు సౌకర్యాలు కూడా బైసన్ పోలో కు అందుబాటు లోనే ఉంటాయి. .విశాలమైన పార్కింగ్ కూడా కొత్త సచివాలయం లో అందుబాటు లో ఉండబోతోంది . కొత్త సచివాలయం చుట్టూ విశాలమైన రోడ్లు వస్తే ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. తెలంగాణ కొత్త సచివాలయం దేశం లోని అన్ని సెక్రటేరియట్ లకు రోల్ మోడల్ కావడం ఖాయం . విపక్షాలు కొత్త సచివాలయ నిర్మాణాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం మాని నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే అది వారికే మంచిది అని కర్నె ప్రభాకర్ వివరించారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి