తెలంగాణ బిజెపి నేతలు బతుకమ్మ, బోనాలు ఇలా ఆడారు (ఫొటోలు)

First Published Sep 7, 2017, 3:47 PM IST
Highlights
  • బోనాలు, బతుకమ్మలు తెచ్చారు
  • ఆడి, పాడి అక్కడే పడేసి వెళ్లిపోయారు
  • బతుకమ్మ, బోనాలు ఇలాగే ఆడతారా అని జనాల్లో చర్చ

తెలంగాణ బిజెపి నేతలు ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. తెలంగాణ సర్కారు చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలపై వారు కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలనే డిమాండ్ తో టిఆర్ఎస్ సర్కారును ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల్లో సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. కానీ వాళ్లు కేసిఆర్ సర్కారును ఇరుకునపెట్టే క్రమంలో వారే స్వయంగా ఇరకాటంలో పడిపోతున్నారు.

బిజెపి నేతలు ఇరకాటంలో పడిపోయారనడానికి నిదర్శనమే ఈ ఫొటోలు.

తెలంగాణ విమచన యాత్రలో భాగంగా మెడ్చల్ లో సభ నిర్వహించారు బిజెపి నేతలు. దీనికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభకు ముందు బోనాలు, బతుకమ్మలతో మహిళా బిజెపి నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. తీరా సభ అయిపోయాక వారు తీసుకొచ్చిన బతుకమ్మ, బోనాలు అక్కడే పడేసి ఎవరి జాగాల వారు వెళ్లిపోయారు. తెలంగాణ బిజెపి నేతలకు తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాల పట్ల ఉన్న శ్రద్ధ ఇలా ఉంటది అని కొందరు సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు.

ఇంకా విచిత్రమేమంటే గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షలు లక్ష్మణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు కార్యకర్తలు 5రూపాయల భోజనం స్టాల్ లోని భోజనమంతా కొనుగోలు చేసి దాన్ని అన్నదానం చేస్తూ ఫొటోలు దిగి హల్ చల్ చేశారు. దానిపై అప్పట్లో పెద్ద దుమారమే నడిచింది. ఎవరో ఒకరిద్దరు నేతలు ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీకి తలనొప్పులు తప్పడంలేదని నాయకులు ఆందోళన చెందుతున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

click me!