హైద్రాబాద్ పహడీషరీఫ్ కేసులో పురోగతి: క్యాబ్‌ను ఎత్తుకెళ్లింది కర్ణాటక ముఠాగా గుర్తింపు

Published : Apr 07, 2023, 04:35 PM ISTUpdated : Apr 07, 2023, 04:48 PM IST
హైద్రాబాద్ పహడీషరీఫ్ కేసులో  పురోగతి: క్యాబ్‌ను ఎత్తుకెళ్లింది  కర్ణాటక  ముఠాగా గుర్తింపు

సారాంశం

 హైద్రాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో  కారును ఎత్తుకెళ్లిన  నిందితులను  పోలీసులు గుర్తించారు.  నిందితుల కోసం  పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్: నగరంలోని  పహాడీ షరీఫ్  పోలీస్ స్టేషన్ పరిధిలో   డ్రైవర్ ను కొట్టి క్యాబ్ ను ఎత్తుకెళ్లిన కేసులో   పోలీసులు పురోగతిని సాధించారు.  కర్ణాటకకు  చెందిన   ముఠా  క్యాబ్ ను  దొంగిలించారని  పోలీసులు గుర్తించారు . గురువారం నాడు  అర్ధరాత్రి  శంషాబాద్  ఎయిర్ పోర్టులో  నిందితులు క్యాబ్ ను బుక్ చేసుకున్నారు.  బాలాపూర్  సమీపంలోని  నిర్మానుష్క ప్రాంతంలోకి  తీసుకెళ్లిన  తర్వాత  డ్రైవర్ ను కొట్టి  క్యాబ్ ను  ఎత్తుకెళ్లారు  దుండగులు .

also read:హైద్రాబాద్‌లో దారుణం: డ్రైవర్‌ను కొట్టి క్యాబ్‌ ను ఎత్తుకెళ్లిన దుండగులు

ఈ విషయమై  బాదితుడి ఫిర్యాదు మేరకు  పోలీసులు దర్యాప్తు  చేశారు.  కర్ణాటకకు చెందిన ముఠా  ఈ  కారును ఎత్తుకెళ్లిందని గుర్తించారు. ఈ ముఠా  కోసం  రాచకొండకు చెందిన నాలుగు  పోలీస్ బృందాలు  కర్ణాటక రాష్ట్రానికి బయలుదేరాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu