చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో యడియూరప్ప పూజలు

Siva Kodati |  
Published : Aug 02, 2019, 11:52 AM IST
చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో యడియూరప్ప పూజలు

సారాంశం

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హైదరాబాద్‌లో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.శుక్రవారం తెల్లవారుజామున శ్రీ యాగంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హైదరాబాద్‌లో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. గురువారం రాత్రి బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న యడ్డీ.. నేరుగా ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.

అనంతరం శుక్రవారం తెల్లవారుజామున శ్రీ యాగంలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యెడ్డీ రాకపై చినజీయర్ శిష్యుడు, మైహోమ్స్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు మాట్లాడుతూ.. యడియూరప్ప సీఎం అయిన సందర్భంగా చినజీయర్ ఆశీర్వాదాలు తీసుకున్నారని.. ఆశ్రమం ప్రాంగణంలో శ్రీరామచంద్రుడిని దర్శించుకున్నారని తెలిపారు.

కేబినెట్ విస్తరణ తర్వాత మరోసారి దర్శనానికి వస్తానని చెప్పినట్లుగా రామేశ్వరరావు వెల్లడించారు. శ్రావణమాసం ఆరంభమవుతున్న సందర్భంగా మంగళ శాసనాలు చేస్తున్నామని.. ఈ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయని.. శ్రావణ మాసం వస్తూ వస్తూనే వానలు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్