పిల్లలతో పరారైన క్యాబ్ డ్రైవర్: ఛేజ్ చేసి పట్టుకున్న పేరేంట్స్

Siva Kodati |  
Published : Aug 02, 2019, 11:11 AM IST
పిల్లలతో పరారైన క్యాబ్ డ్రైవర్: ఛేజ్ చేసి పట్టుకున్న పేరేంట్స్

సారాంశం

శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేపింది.పిల్లలు ఒక క్యాబ్‌లో, తల్లిదండ్రులు మిగిలిన కుటుంబసభ్యులు మరో క్యాబ్ ఎక్కారు. అయితే పిల్లలను ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. 

శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేపింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కుటుంబం నగరంలోని ఓ ప్రాంతానికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లు బుక్ చేసుకుంది.

పిల్లలు ఒక క్యాబ్‌లో, తల్లిదండ్రులు మిగిలిన కుటుంబసభ్యులు మరో క్యాబ్ ఎక్కారు. అయితే పిల్లలను ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు.

దీంతో మరో కారులో ఆ కారును వెంబడించిన తల్లీదండ్రులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అనంతరం శంషాబాద్ పీఎస్‌లో డ్రైవర్‌ను అప్పగించి ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే