
హైదరాబాద్: Karnamguda కాల్పుల ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ Raghavender Reddy మరణించారు. కాల్పులు జరిగిన ప్రదేశంలోనే Srinivas Reddyమరణించారు. తీవ్రంగా గాయపడిన రాఘవేందర్ రెడ్డి బీఎన్ రెడ్డి నగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
Hyderabad నగరంలోని Srinivas Reddy, రాఘవేందర్ రెడ్డి లు రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలనే 10 ఎకరాలను వీరిద్దరూ ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశారు. అయితే ఇంద్రారెడ్డి విక్రయించిన భూమిలో మట్లారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నాడు.
ఇవాళ ఉదయం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి రెడ్డిలు కర్ణంగూడకు వచ్చారు. ఆ సమయంలో మట్టారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. భూమి విషయమై మట్టారెడ్డికి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ సమయంలోనే కాల్పులు జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మట్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి లతో కలిసి మరో వ్యక్తి కూడా కారులో ప్రయాణించినట్టుగా సమాచారం. అయితే ఆ మూడో వ్యక్తి ఎవరనే విషయమై దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవాళ ఉదయమే రియల్ ఏస్టేట్ పని మీద బయటకు వెళ్తున్నట్టుగా రఘునందన్ రెడ్డి తన భార్యకు చెప్పారు. ఇంటి నుండి ఉదయం 5 గంటలకు బయలు దేరారు. ఉదయం 8 గంటల సమయంలో గొడవ జరిగిందని సమాచారం. అదే సమయంలోనే కాల్పులు జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే కాల్పులు ఎవరు జరిపారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అక్కడిక్కడే మరణించారు. రాఘవేందర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. రాఘవేందర్ రెడ్డిని బీఎన్ రెడ్డి నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
సోమవారం నాడే మట్టారెడ్డిని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించినట్టుగా సమాచారం. శ్రీనివాస్ రెడ్డి కోనుగోలు చేసిన భూమి విషయమై ఇతర ప్లాట్ల యజమానులను మట్టారెడ్డి రెచ్చగొడుతున్నారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారని శ్రీనివాస్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇవాళ ఉదయమే శ్రీనివాస్ రెడ్డితో పాటు రాఘవేందర్ రెడ్డిపై కాల్పులు జరిగాయి. శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రాఘవేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
మూడు మాసాల క్రితమే 10 ఎకరాల భూమిని శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కొనుగోలు చేశారు. ప్రతి రోజూ శ్రీనివాస్ రెడ్డి, ఈ ప్రాంతానికి వచ్చేవారు. తాను కొనుగోలు చేసిన భూమిలో వాకింగ్ చేసి తిరిగి వెళ్లేవాడు. అయితే ఇవాళ ఉదయం శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలతో మట్టారెడ్డి ఇవాళ గొడవకు దిగారని చెబుతున్నారు. ఆ తర్వాతే కాల్పుుల జరిగాయని సమాచారం. ఈ విషయమై మట్టారెడ్డి అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు అల్మాస్ గూడకు చెందినవారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలతో మాట్లాడుదామని పిలిపించి దుండగులు చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యర్ధులు దాడి చేసే రాఘవేందర్ రెడ్డి తప్పించుకొనేందుకు అక్కడి నుండి పారిపోయాడు. అయితే రాఘవేందర్ రెడ్డిపై ప్రత్యర్ధులు కాల్పులకు దిగారు. శ్రీనివాస్ రెడ్డిని దుండగులు కొట్టి చంపారు.