కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిపై బదిలీ వేటు: డీజీపీ ఆఫీస్ కు అటాచ్

Siva Kodati |  
Published : Jul 27, 2021, 05:54 PM ISTUpdated : Jul 27, 2021, 06:04 PM IST
కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిపై బదిలీ వేటు: డీజీపీ ఆఫీస్ కు అటాచ్

సారాంశం

కరీంనగర్ పోలీస్ కమీషనర్‌ కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణను నియమించింది.   

కరీంనగర్ పోలీస్ కమీషనర్‌గా వ్యవహరిస్తున్న కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కమలాసన్ రెడ్డి స్థానంలో కరీంనగర్ సీపీగా రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణను నియమించింది ప్రభుత్వం. కరీంనగర్ సీపీగా కమలాసన్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక కీలక కేసులను ఛేదించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కమలాసన్ రెడ్డి బదిలీ వ్యవహారం పోలీస్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే